![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 709 లో..... దీప సీఈఓ అయిందని కాంచన తన కోసం చీరలు ఇంకా బంగారం గొలుసు తీసుకుంటుంది. అవి చూసి దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నీకంటూ ఒక హోదా ఉంది. అందుకే మంచిగా వెళ్ళాలని కాంచన అంటుంది. అయిన డబ్బు ఎక్కడిది అని దీప అడుగుతుంది. మీ మావయ్య గారు ఇచ్చారు. ఆయనే ఖర్చులకి ఉంచమని ఇచ్చారు. ఆయనే కొన్నాడు అనుకోమని కాంచన అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి అన్ని అమ్మకేనా నాకేం లేవా అని అడుగుతుంది. నీకు స్వీట్ ఉంది తీసుకోమని కాంచన ఇస్తుంది.
నాకు సైకిల్ కావాలని శౌర్య అంటుంది. నువ్వు నిన్న తాతతో ఫోన్ మాట్లాడడం.. నేను చూసానని శౌర్య అనగానే దీప, కార్తీక్ నవ్వుకుంటారు. ఈ సారి తాతకి ఫోన్ చేసినప్పుడు నాకు సైకిల్ కొనివ్వమని చెప్పమని అంటుంది. మరొకవైపు సూరజ్ ని ఇంట్లో నుంచి పంపించాలని పారిజాతం ప్లాన్ చేసి ఒక అమ్మాయితో క్యారేజ్ ఇచ్చి సూరజ్ గదిలోకి పంపిస్తుంది. తను లోపలికి వెళ్ళగానే పారిజాతం బయట తాళం వేస్తుంది. ఎవరు నువ్వు బయట తాళం ఎందుకు వేశారని సూరజ్ ఆ అమ్మాయిని అడుగుతాడు. లవర్ ని కదా అని ఆ అమ్మాయి అంటుంది. ఆ తర్వాత పారిజాతం లోపలికి వెళ్లి సూరజ్ ఎవరినో ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడని అందరిని అవుట్ హౌస్ దగ్గరికి తీసుకొని వచ్చి బయట తాళం తీస్తుంది. లోపల ఆ అమ్మాయి ఇంకా సూరజ్ ఉండడం చూసి అందరు షాక్ అవుతారు. ఇలాంటి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించాలని పారిజాతం అంటుంది. అప్పుడే లోపల నుంచి కార్తీక్ వస్తాడు. నువ్వు ఏంట్రా ఇక్కడ అని పారిజాతం అడుగుతుంది. నేనే కాదు నా బంగారం దీప కూడా వచ్చిందని కార్తీక్ అనగానే పారిజాతం షాక్ అవుతుంది. మీరేంటి ఇక్కడ అని పారిజాతం అడుగుతుంది.
సూరజ్ ఇంట్లో చాలా దుమ్ముపట్టి ఉందట.. అందుకే మాకు తెలిసిన పని అమ్మాయిని తీసుకొని వచ్చామని కార్తీక్, దీప అంటుంది. ఏం బుజ్జి అని ఆ అమ్మాయిని దీప అడుగుతుంది. తనకి లోపల వార్నింగ్ ఇచ్చింది గుర్తుచేసుకొని భయపడుతూ అవునని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. పారిజాతంపై శివన్నారాయణ కోప్పడతాడు. అందరు లోపలికి వెళ్ళాక.. ఏంటి పారు తన పేరు గీత కదా బుజ్జి అంటున్నారు అనుకుంటున్నావా.. నీకొక విషయం చెప్పానా అవుట్ హౌస్ కి తాళం తీసుకొని వచ్చింది నేనే అని కార్తీక్ అనగానే పారిజాతం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |